Lollipop Telugu Song Lyrics Vinay Shanmukh,SidSriram,Ananya

Lollipop Telugu Song Lyrics This Beautiful Song Music composed by Vijai Bulganin Song sung by Sid Sriram and Lollipop Telugu Song Lyrics wrietten by Suresh Banisetti. Lollipop Song Lyrics in Telugu

  • Song : Lollipop Telugu Song
  • Music : Vijai Bulganin
  • Singer : Sid Sriram
  • Lyrics: Suresh Banisetti
  • Music Lable : Vinay Shanmukh

Lollipop Telugu Song Lyrics

మొదటిసారి మొదటిసారి
ప్రేమ గాలే తాకుతుంటే
ఏది రాగం ఏది తాళం
తెలియదాయే అయ్యో పాపం

కలువలాంటి కనులలోన
కలలవాయనే దూకుతుంటే
ఏది గానం ఏది నాట్యం
తేలదాయె అయ్యో పాపం

తీపిగా ఊహలన్ని
చుట్టుముట్టుకున్న వేళ
మనసుకే లొంగిపోడమే ఇష్టం

వరదలా ఆశలన్నీకట్ట తెంచుకున్న వేళ
వయసునే పట్టుకోడమే
కష్టం

అర్ధం కాని సరికొత్త చదువుని
రాత్రి పగలు చదివేయడం
అద్ధం ముందు ఇన్నాళ్ళు ఎరుగని
అందం మెరుగు దిద్దేయడం

అంత గజిబిజి ఉంటుందే
అంతా తికమకగా…. ఆ ఆ

కాలం కదలదే , మైకం తొలగదే
మొహం విడువదే….ప్రేమే ఉంటే
దూరం జరగదే, భారం తరగదే
తీరం దొరకదే….ఇంతే ప్రేమలోన ఉంటే

రెండే కళ్ళు కదా
అవి కలలకి ఇల్లు కదా
ఎన్ని పనిచేస్తున్నా

ఇంకొన్ని మిగిలే ఉండునుగా

ఒకటే గుండె కదా
అది మరి తలపుల కుండ కదా
ఎంత ఒంపేస్తున్నా అవ్వదు ఖాళీయేగా…

ప్రతి మాట చిత్రం,ప్రతి పూట చైత్రం
ప్రతి చోట ఏదో ఒక ఆత్రం

ప్రతి చూపు అందం,ప్రతి వైపు అందం
ప్రతి గాలి ధూళీ గంధం…

కాలం కదలదే… మైకం తొలగదే…
మొహం విడువదే…ప్రేమే ఉంటే…
దూరం జరగదే… భారం తరగదే…
తీరం దొరకదే…ఇంతే ప్రేమలోన ఉంటే…

మొదటిసారి మొదటిసారి
ప్రేమ గాలే తాకుతుంటే
ఏది స్వర్ణం ఏది వర్ణం
తెలియదాయే అయ్యో పాపం

అదుపేలేని పొదుపులేని
కుదుపులే ఓ చేరుకుంటే
ఏది స్వప్నం ఏది సత్యం
తెలదాయే అయ్యో పాపం

కడలిలా అంతులేని
వింత హాయి పొంగుతుంటే
పడవలా కొట్టుకెళ్ళదా ప్రాయం
అడవిలా దట్టమైన ఆదమరపు
కమ్ముకుంటే నెమలిలా
చిందులెయ్యదా ప్రాణం

చిత్తం చెదరగొట్టేది అంటే
ప్రేమాకర్షణే కాదా
మొత్తం రెండు హృదయాల నడుమ
తీరని ఘర్షణే రాదా

ఏదో సతమతమే రోజంతా…
ఏదో కలవరమే…ఏఏ

కాలం కదిలెనే… మైకం తొలిగెనే…
మౌనం కరిగెనే….ప్రేమ వల్లే….
దూరం జరిగెనే… భారం తరిగెనే….
తీరం దొరికెనే…
అంతా ప్రేమ మాయ వల్లే…

Other Telugu Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button