Saami Saami Song Lyrics in Telugu | Pushpa Movie Song Lyrics

Saami Saami Song Lyrics in Telugu, Sami Sami Song Lyrics This Song was Composed by Devi Sri Prasad Song sung by Mounika Yadav and Saami Saami Song Lyrics written by Chandrabose nuv ammee ammee Song Lyrics నువ్ అమ్మీ అమ్మీ

  • Song : Saami Saami
  • Movie : Pushpa
  • Singer: Mounika Yadav
  • Lyrics : Chandrabose
  • Music: Devi Sri Prasad
  • Music Lable : Aditya Music

Saami Saami Song Lyrics in Telugu

నువ్ అమ్మీ అమ్మీ అంటాంటే

నీ పెళ్ళాన్నైపోయినట్టుందిరా

సామి నా సామి

నిను సామి సామి అంటాంటే

నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా

సామి నా సామి

నీ ఎనకే ఎనకే అడుగెత్తాంటే

ఎంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామి

నీ పక్కా పక్కన కూసుంటాంటే

పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామి

నువ్ ఎల్లే దారి సూత్తా ఉంటే

ఏరే ఎండినట్టుందిరా

సామి నా సామి

నా సామి , రారా సామి

బంగరు సామి,మీసాల సామి

రోషాల సామి

నా సామి (సామి)

రారా సామి (సామి)

బంగరు సామి , మీసాల సామి

రోషాల సామి

పిక్కల పైదాకా

పంచె నువ్ ఎత్తికడితే

పిక్కల పైదాకా

పంచె నువ్ ఎత్తికడితే

నా పంచ ప్రాణాలు పోయెను సామి

కార కిల్లి నువ్

కస్సు కస్సు నములుతుంటే

నా ఒళ్ళు ఎర్రగా పండేను సామి

నీ అరుపులు కేకలు ఇంటా ఉంటే

ఏ ఏ ఏ ఏ ….

నీ అరుపులు కేకలు ఇంటా ఉంటే

పులకారింపులే సామి

నువ్ కాలు మీద కాలేసుకుంటే

పూనకాలే సామి

రెండు గుండీలు ఎత్తి

గుండెను సూపిత్తే

పాలకుండ లెక్క పొంగిపోతా

సామి నా సామి

నా సామి,రారా సామి

బంగరు సామి, మీసాల సామి

రోషాల సామి

నా సామి (సామి)

రారా సామి (సామి)

బంగరు సామి, మీసాల సామి

రోషాల సామి

కొత్త సీరె కట్టూకుంటే….

 ఎట్టా ఉందో సెప్పాకుంటే

కొత్త సీరె కట్టూకుంటే

ఎట్టా ఉందో సెప్పాకుంటే

కొన్న ఇలువ సున్నా అవదా సామి

కొప్పులోన పువ్వులు పెడితే

గుప్పున నువ్వే పీల్చకుంటే

పూల గుండె రాలి పడదా సామి

నా కొంగే జారేటప్పుడు నువ్వూ

ఆ ఆ ఆ ఆ

నా కొంగే జారేటప్పుడు నువ్వే

సూడకుంటె సామి

ఆ కొంటె గాలి నన్నే చూసి

జాలే పడదా సామి

నా అందం సందం నీదవ్వకుంటే

ఆడ పుట్టుకే బీడైపోదా

సామీ, నా సామీ

నా సామి, రారా సామి

బంగరు సామి, మీసాల సామి

రోషాల సామి

నా సామి (సామి)

రారా సామి (సామి)

బంగరు సామి, మీసాల సామి

రోషాల సామి

Other Hit Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button