Allipoola Vennela Song Lyrics in Telugu | Bathukamma Song Song Lyrics
Allipoola Vennela Song Lyrics అల్లిపూల వెన్నెల This Song Music Composed by AR Rahman and Directed by Gautham Menon. Allipoola Vennela Song Lyrics written by Mittapalli Sarender Song sung by Unnikrishnan
Song | Allipoola Vennela |
Music | A.R Rahman |
Lyrics | Mittapalli Sarender |
Singer | Unnikrishnan |
Director | Gautham Menon |
Audio Lable | Aditya Music |
Allipoola Vennela Song Lyrics in Telugu
అల్లిపూల వెన్నెల చెరువులోన కురవగా
పూలకింద్ర ధనస్సులే నేలమీద నిలవగా
కొమ్మలన్ని అమ్మలై వేల పూలు విరియగా
పుట్టమన్ను మట్టిలో మట్టి గౌరి పుట్టగా
అల్లిపూల వెన్నెల చెరువులోన కురవగా
తరలివచ్చే తంగెడు తనకు పట్టు చీరగా
రవికెలోన తామర పువ్వులన్ని మారగా
తనువుకేమో గుమ్మడి బంధమయ్యి నిలువునా
పొద్దుపొడుపుదిద్ది నీ నుదుటి మీద కుంకుమ
ఊలితల్లి గొంతులో కోయిలమ్మ కూయగా
తెలంగాణ కొచ్చెనే బతుకమ్మ పండుగా
ఆ ఆ ఆఆఆఆ
అఅ ఆఆ ఆ
అ అ ఆఆ ఆ
కమ్మగుండె గూటికి ఆడపడచు ఆటకి
గునుగు పూల తోటకి ఏనుగు మీద తేగకి
ఏరువాక ఎదలకి ఏటిలోని అలలకి
కట్ల పూల కళ్ళకి కానుకయ్యి పల్లకి
తరలి తరలి వచ్చెనే…బతుకమ్మ
వరదలపై తరలిపోవు తన జన్మ
ఆఆఆఆ మెట్టినింటి పిలుపుతో
వెళ్లిపోయే చెల్లెలా
జ్ఞాపకాల బరువులో చెమ్మగిల్లె తల్లిలా
ఆడబిడ్డ చెయ్యిని తల్లి తల్లి గడపని
దాటిపోయే నీటిలో ఒదిగిపోయె వేళలో
సాగనంపి చెల్లెలు చెరువు కొమ్మ చివరలో
మరల మరలి రమ్మని బతుకమ్మని వీడగా
అల్లిపూల వెన్నెల చెరువులోన కురవగా
పూలకింద్ర ధనస్సులే నేలమీద నిలవగా
కొమ్మలన్ని అమ్మని వేల పూలు విరియగా
పుట్టమన్ను మట్టిలో మట్టి గౌరి పుట్టగా
సై సై…సై సై…హయ్ హయ్
హయ్ హయ్… సై సై.. సై సై