Enduke Ila Gunde Lopala Song Lyrics in Telugu & English | Sambaram
Enduke Ila Gunde Lopala Song Lyrics in Telugu ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా
Enduke Ila Gunde Lopala Song Lyrics in Telugu
ఎందుకే ఇలా గుండె లోపల
ఇంత మంట రేపుతావు అందని కలా
అన్ని వైపులా అల్లుకోకిలా
ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
వెంటాడుతు వేధించాలా
మంటై నను సాధించాలా
కన్నీటిని కురిపించాలా
ఙ్ఞాపకమై రగిలించాలా
మరుపన్నదే రానీయవా
దయలేని స్నేహమా
ఎందుకే ఇలా…గుండె లోపల
ఇంత మంట రేపుతావు…అందని కలా
అన్ని వైపులా అల్లుకోకిలా
ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
తప్పదని నిను తప్పుకొని
వెతకాలి కొత్తదారి
నిప్పులతో మది నింపుకుని
బ్రతకాలి బాటసారి
జంటగా చితిమంటగా
గతమంత వెంట ఉందిగా
ఒంటిగా నను ఎన్నడు వదిలుండనందిగా
నువ్వూ నీ చిరునవ్వు చేరని చోటే కావాలి
ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి
ఎందుకే ఇలా గుండె లోపల
ఇంత మంట రేపుతావు అందని కలా
అన్ని వైపులా అల్లుకోకిలా
ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
ఆపకిలా ఆనాటి కల అడుగడుగు తూలిపోగా
రేపకిలా కన్నీటి అల ఏ వెలుగు చూడనీక
జన్మలో నువ్వు లేవని ఇకనైన నన్ను నమ్మని
నిన్నలో వదిలేయని ఇన్నాళ్ళ ఆశని
చెంతే ఉన్నా సొంతం కావని నిందించే కన్నా
నన్నే నేను వెలివేసుకొని దూరం అవుతున్నా
ఎందుకే ఇలా గుండె లోపలా
ఇంత మంట రేపుతావు అందని కలా
అన్ని వైపులా అల్లుకోకిలా
ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
- Song : Enduke ila
- Movie : Sambaram
- Singer: R.P. Patnaik
- Music: R.P. Patnaik
- Lyrics : Sirivennela Seetharama Sastry