Kaatilo Kale Kattela Meda Song Lyrics in Telugu ఓ మనిషి బొందల

Kaatilo Kale Kattela Meda Song Lyrics ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్థి This Beautiful Song Music Composed by Yada Goud Koninti Song sung by Balu K Asura Kaatilo Kale Kattela Meda Song Lyrics written by Balu K Asura

  • Song: Kaatilo Kale Kattela Meda
  • Music: Yada Goud Koninti
  • Lyrics: Balu K Asura
  • Singer: Balu K Asura
  • Music Lable: Chinmai Studios

Kaatilo Kale Kattela Meda Song Lyrics\\

కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా..
నీవు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా..
నీవు ఆడిన ఆటలు.. చెప్పిన మాటలు.. చాలుర ఓ నరుడా..
మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా..
ఓ ఓ ఓమనిషి.. బొందల గడ్డర నీ ఆస్తి..
ఓ ఓ ఓమనిషి.. తొందరపడితే కాదు మరి..
కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే..
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా..
ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా.
.

నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా..
నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా..
కాలె నిప్పుల బూడిదలోనూ బజ్జో నా కన్నా..
ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా..
ఓ ఓ ఓమనిషి.. బొందల గడ్డర నీ ఆస్తి..
ఓ ఓ ఓమనిషి.. తొందరపడితే కాదు మరి..
కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే..
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా..
నీవు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా
..

నీ పిండం కాకులు ముట్టని రోజులు తప్పక వస్తయిరా..
నీ వాళ్లే నిన్ను వంటరిగా వదిలేసి పోతరురా..
నీ మిగిలిన ఆస్తుల పంపకమంటూ పరువును తీస్తరురా..
నీ ఇంటె అడవిలో నీకొక రంగుల బందుల కడతరురా..
ఓ ఓ ఓమనిషి.. బొందల గడ్డర నీ ఆస్తి..
ఓ ఓ ఓమనిషి.. తొందర పడితే కాదు మరి..
కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే..
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా..
నీవు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా..

చెదలు తినే ఈ కట్టెకు ఎందుకు పగ ప్రతికారమురా..
చిరు నవ్వుతో బ్రతికి ప్రేమను పంచితే సొమ్మేంపోతదిరా..
పగిలే గుండెకు ఎడమచేతితో నిప్పంటిస్తరురా..
స్వర్గం నరకము ఉన్నదొలేదో ఎవరికి తెలియునురా..
ఓ ఓ ఓమనిషి.. మాయా ప్రపంచం ఈ లోకం..
ఓ ఓ ఓమనిషి.. కలల ప్రపంచం ఈ లోకం..
కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే..
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా..
ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా..

Credits to – అశోక్‌రెడ్డి అన్నపురెడ్డి గారు

  1. Love Songs: CLICK HERE
  2. New Songs : CLICK HERE
  3. Folk Songs: CLICK HERE
  4. Telugu Rap Songs: CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button