Ekkada Vunna Pakkana Lyrics in Telugu from Nuvve Kavali Song Lyrics
Ekkada Vunna Pakkana Lyrics ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది This Song was Music Composed by Koti.Ekkada Vunna Pakkana Lyrics written by Sirivennela and Song Sung by Sriramprabhu, Gopika Poornima
Song : Ekkada Vunna Pakkana
Movie : Nuvve Kavali
Lyrics : Sirivennela
Music :Koti
Singers : Sriramprabhu, Gopika Poornima
Ekkada Vunna Pakkana Lyrics in Telugu
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
చెలి ఇదేం అల్లరి
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూఉంది
అరె ఇదేం గారడీ
నేను కూడా నువ్వయాన, పేరు కైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావన
ఊ.. దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావన
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
చెలి ఇదేం అల్లరి
నిద్దుర తుంచే మల్లెల గాలి
వద్దకు వచ్చి తానెవరందీ
నువ్వే కదా చెప్పు ఆ పరిమళం…
వెన్నలా కన్నా చల్లగ ఉన్న
చిరునవ్వేదో తాకుతూ ఉంది
నీదే కాదా చెప్పు ఆ సంబరం…
కన్నుల ఎదుట నువు లేకున్న
మనసు నమ్మదే చెబుతున్నా
ఎవ్వరు ఎవ్వరితో ఏమన్నా
నువ్వు పిలిచినట్టనుకున్నా
ఇది హాయో ఇది మాయో నీకైన తెలుసునా?
ఏమీటౌతుందో ఇలా నా ఎద మాటున
హొ.. దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావన
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
చెలి ఇదేం అల్లరి
కొండల నుంచి కిందికి దూకే
తుంటరి వాగు నాతో అంది…
నువ్వు అలా వస్తూ ఉంటావని
గుండెల నుంచి గుప్పున ఎగసే
ఊపిరి నీకో కబురంపింది…
చెలి నీకై చూస్తూ ఉంటానని
మనసు మునుపు ఎప్పుడూ ఇంత
ఉలికి ఉలికి పడలేదు కదా
మనకు తెలియనిది ఈ వింత
ఎవరి చలవ ఈ గిలిగింత
నా లాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా…?
ఏమీ చేస్తున్న పరాకే అడుగడుగున
హొ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావన
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూఉంది
అరె ఇదేం గారడీ
నేను కూడా…నువ్వయాన …పేరు కైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావన
ఊ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావన
Ekkada Vunna Pakkana Lyrics in English
Ekkada unna pakkana nuvve unnatuntundi..
Cheli idem allarii
Na needaina acham nela kanipistuundi
Are idem garadi
Nenu kuda nuvvayana…peru kaina nenu lena
Diini perana prema ane priyabhavana
O..diini perana prema ane priyabhavana
Niddura tunche mallela gali vadaku vachi tanevarandi
Nuvve kada chepu aa parimalam
Vennala kanna chalaga unna chirunavedo takutu undi
Niide kada chepu aa sambaram
Kannula yeduta nuvu lekunna
Manasu nammade chebutunna
Evvaru evvarito emanna
Nuvvu pilichinatanukkuna
Idi hayo idi mayo nikaina telusuna
Emitautundo ila na yeda matuna
O..diini perana prema ane priyabhavana
Kondala nunchi kindiki duuke
Tuntari gali naato andi
Nuvvu ala vastu untavani
Gundela nunchi guppuna egase oopiri neeko kaburampindi..
Cheli neeki chustu untaanani
Manasu munupu eppudu intha
Uliki uliki padaledu kada
Manaku teliyanidivintha
Evari chalava ee giligintha
Naa lage neekuda anipisthu unnada
Emi chestunna parake adugaduguna…
O..diini perana prema ane priyabhavana
- Sad Song lyrics: CLICK HERE
- New Song lyrics: CLICK HERE
- Love Song lyrics: CLICK HERE