Kalam Nitho Naduvadu lyrics Best Motivational Telugu Song Lyrics

Kalam Nitho Naduvadu lyrics కాలం నీతో నడవదు This Awesome Motivational Song Music Composed by Ravi Kalyan Lyrics Written by Prasad Manukota and Song Sung by Hymath Motivational Telugu Song Lyrics

Song : Kalam Nitho Naduvadu

Lyrics : Prasad Manukota

Singer : Hymath

Music : Ravi Kalyan

Kalam Nitho Naduvadu lyrics in Telugu-telugulyricsguru.com

కాలం నీతో నడవదు నిన్నడిగీ ముందుకు సాగదు

సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము

విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు

నీ లక్ష్యం చేరే మార్గం లో ప్రతి క్షణమూ విలువని తెలుసుకో

ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు ,

మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీది అని అడగదు

ప్రేమ జాలీ చూపదు దయ దాక్షిణ్యాలే వుండవు

దానికి విలువని ఇస్తే గెలుస్తవు

అది మరిచితే అక్కడే ఆగుతవు

మనకున్న టైం సరిపోదు తమ్మి జర జల్దీ మేలుకోరో

సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే !!2!!

క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన

సమయాభావం తప్పని అది లేదని చెప్పితే కుదరదే

గెలిచిన వీరుని మనసుని అడుగు

సమయం విలువేంటో

గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో

అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా … !కాలం నీతో !

ఒకసారి నువ్వు బతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని

తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి ! 2 !

నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయం అంటే తమ్ముడా

విలువలతోనే బ్రతికే బ్రతుకును అందిస్తదిరా నిండుగా

క్రమశిక్షణ ను నేర్పిస్తది రా సమయం అనునిత్యం

స్వేరో సైనికుడై సాగరా కాలం నీ నేస్తం

ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడా ధైర్యం నీకనునిత్యం…..!కాలం నీతో !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button