Oorellipota Mama (ChowRaasta) Song Full Lyrics In Telugu
Oorellipota Mama (ChowRaasta) Song Full Lyrics In Telugu
Song by: Oorellipota Mama Song Full Lyrics In English
Lyrics: Anand Gurram and Ram Miriyala
Singer: Ram miriyala
Editing: Satya Ch
Oorellipota Mama (ChowRaasta) Song Full Lyrics In Telugu.TeluguLyricsGuru.Com
ఊరెళ్లిపోతామామ ఊరెళ్లిపోతా మామ
ఎర్రబస్సెక్కి మళ్లీ తిరిగెళ్లిపోతా మామ || 2 ||
ఏ ఊరెళ్తావ్ రామ ఏముందనెళ్తావ్ రామ
ఊరన్నపేరే తప్ప తీరంతా మారేరామ || 2 ||
నల్లామలఅడవుల్లోన పులిసింత సెట్ల కింద
మల్లేలుపూసేటి సల్లాని పల్లొకటుంది
మనసున్నపల్లె జనం మోసం తెలియనితనం
అడవిఆ పల్లె అందం పూవ్వు తేనేలసందం
నల్లామలఅడవుల్లోన పులిసింత సెట్ల కింద
పుత్తడిగనుల కోసం సిత్తడి బావులుతవ్వే
పుత్తాడిమెరుపు ల్లోన మల్లేలు మాడీ పోయే
మనసున్నపల్లె జనం వలసల్లో సెదిరీపోయే
ఏ ఊరెళ్తావ్ రామ ఏముందనెళ్తావ్ రామ
ఊరన్నపేరే తప్ప తీరంతా మారేరామ || 2 ||
గోదారిలంకల్లోన అరిటాకు నీడల్లోన
ఇసుకతిన్నేలు మీదా వెండి వెన్నెల్లుకురువ
గంగమ్మగుండెల్లోనా వెచ్చంగా దాచుకున్న
సిరులెన్నోపొంగి పొర్లే పచ్చని పల్లొకటుంది
గోదారిగుండెల్లోనా అరిటాకు నీడల్లోన
ఇసుకంతతరలిపోయే ఎన్నెల్లు రాలిపోయే
ఎగువగోదారి పైన ఆనకట్టాలు వెలిసే
ఆ పైన పల్లెలన్నీ నిలువునామునిగిపోయే
ఏ ఊరెళ్తావ్ రామ ఏముందనెళ్తావ్ రామ
ఊరన్నపేరే తప్ప తీరంతా మారేరామ !!!