Dharmam Saranam Gacchami Song Lyrics | ధర్మం శరణం గచ్ఛామి లిరిక్స్
ధర్మం శరణం గచ్ఛామి దానంశరణం గచ్ఛామి ఈ పాట స్వాతిముత్యం చిత్రంలోనిది దీనికి సంగీతం ఇళయరాజా గారు మరియు సాహిత్యం ఆచార్య ఆత్రేయ గారు అందించారు అలాగే ఈ పాటను బాలు, ఎస్. పి. శైలజ పాడారు
పాట | ధర్మం శరణం గచ్ఛామి |
చిత్రం | స్వాతిముత్యం (1986) |
సంగీతం | ఇళయరాజా |
సాహిత్యం | ఆచార్య ఆత్రేయ |
గానం | బాలు, ఎస్. పి. శైలజ |
Dharmam Saranam Gacchami Song Lyrics in Telugu
ధర్మం…శరణం గచ్ఛామి
దానం…శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
దానం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
దానం శరణం గచ్ఛామి
ఇంతో అంతో… ఓ ఓ ఓ
ఇంతో అంతో ఇచ్చిన వారికి ఇహమే స్వర్గం
లేదిక మరుజన్మం
లేదిక మరుజన్మం
ధర్మం శరణం గచ్ఛామి
దానం శరణం గచ్ఛామి
తెల్ల వారితే కూడు దక్కకా
పొద్దు వాలితే గూడు చిక్కకా
తెల్ల వారితే కూడు దక్కకా
పొద్దు వాలితే గూడు చిక్కకా
బాధలు మోసే అభాగ్యులం
బతుకులు ఈడ్చే అనాథలం
అభాగ్యులం అనాథలం
అభాగ్యులం అనాథలం
ధర్మం శరణం గచ్ఛామి
దానం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
దానం శరణం గచ్ఛామి
కన్నవారికి కానివారమై ఈ ఈ ఈ
కన్నవారికి కానివారమై
ఉన్న ఊరికి దూరదూరమై
ఎన్ని గడపలు ఎక్కామో
ఎన్ని కాళ్ళకు మొక్కామో
అభాగ్యులం అనాథలం
అభాగ్యులం అనాథలం
ధర్మం శరణం గచ్ఛామి
దానం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
దానం శరణం గచ్ఛామి