Neela Neelamma Cheralo Neela Song Lyrics నీల నీలం సీరాలో

Neela Neelamma Cheralo Neela Song Lyrics నీల నీలం సీరాలో This song lyrics are written by the Suman Badnakal. Music given by : Ravi kalyan and this song is sung by Matla Srujana, Suman Badnakal. Music is labelled by
KARIMNAGAR TV.

  • Song : Neela Neelamma Cheralo Neela
  • Lyrics : Suman Badnakal
  • Singers : Matla Srujana, Suman Badnakal
  • Cast : Shilpa Kaveri & Surya Prakash
  • Music : Ravi kalyan
  • Direction & Cheoreography : Anil Raj
  • Camera & Editing : Amar B
  • Producer’s : Koppula Sai Krishna,Divya
  • Music Lable: KARIMNAGAR TV
Neela Neelamma Cheralo Neela Song Lyrics in Telugu

నీల నీలం సీరాలో నీల నింగిలో వెన్నలవే నా నీల

నింగిలో వెన్నెలవే నా నీల

మాయ మాటల తుంటరి వాడ మాయలు చేయకురా నా బావ సైగలు ఏయకురా నా బావ

ఓయ్యరాల నడక దాన,ఒంపు సొంపులు అందం దాన

నెమలి కన్నుల సిన్నదాన,నెగలలేని అందం జూడ

ఒంటిగచ్చే దానిని చూసి,ఎనుక ఎనుకా వచ్చుడేలా

సిత్తురాల సిన్నవాడ,సరసమాడ సమయమెలా

కారులు అచ్చనే నీల కారులు అచ్చే

కారులు అచ్చానే నా నీల కారులు అచ్చానే నా నీల

కారులోన కుంకుమ పువ్వుల వాసనలు వచ్చేర నా బావ వాసనలు వచ్చేర నా బావ

నెత్తి మీద గంపాను ఎత్తి

నేల వంకల నువు పోతుంటే

మొగిలి పువ్వుల వెన్నెలా దాన

మోము జూడే ఒకసారైనా

మత్తు జల్లే సూపుల తోటి

మాటు కాసేద వేళ బావా

సాలు సాలు సరసాల మాట

నువు వలికే జూటాల మాట

బస్సులు అచ్చనే నీల బస్సులు అచ్చే

బస్సులు అచ్చానే నా నీల

బస్సులు అచ్చానే నా నీల

బస్సులోనా బంతి పువ్వుల

వాసనలు అచ్చేర నా దొర

వాసనలు అచ్చేర నా దొర

సిలకాల బాయి పోలము లోనా

వంగి నాట్లు వేసేదాన

నడుము మీద ఉన్న మడత

చెంతా రావే బంగారు సిలకా

కోర మీసాల చిన్నవాడ

కొంటే సూపులు సూసుడు ఎలా

ఆపులే నీ మాయ ప్రేమా

పడదులే ఈ సక్కటీ భామ

జీపులు అచ్చనే నీల జీపులు అచ్చే

జీపులు అచ్చానే నా నీల జీపులు అచ్చానే నా నీల

జీపులోన జిలేబి పొట్లాల వాసనలు అచ్చేరా నా దొర

వాసనలు అచ్చేరా నా దొర

నువ్వు ఏసిన ముగ్గు ఎంతో ముద్దు

నిన్ను సూడగా లేదే హద్దు

నిన్ను మెచ్చిన పిల్లవాని

నీ వెంటే వచ్చేటోని

నాకు తోడు నీవు ఉండగా

కలిసి రానా నీతో నీడగా

ఏలు పట్టక రావా బావా

నిత్యం నన్ను ఏలుకోవా

లారీలు అచ్చనే నీల లారీలు అచ్చే

లారీలు అచ్చానే నా నీల లారీలు అచ్చానే నా నీల

లారిలోనా లై లై పాటల లోల్లి జేయాంగ నా బావ

నీ తోడు నేనుంటారా నా బావ

లోల్లే జేయాంగా నా భామ

నా తోడు నువ్వండవా నా భామ

నీ తోడు నేనుంటారా నా బావ

నీ తోడు నేనుంటారా నా బావ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button